30 Happy Birthday Wishes in Telugu [తెలుగులో]

Happy Birthday Wishes in Telugu: Every person born on this earth on a particular day. That day is special for them. They Celebrate on that day, Its an amazing experience. Birthday is one of The Best day in Every body lives. Celebrities, Popular People may get More wishes on that day than others. But normally every person is greeted on their birthday by friend, mother, sister, brother. Even an Unknown Person Wishes you on your birthday if he knows about it.

Here are some of the selected Birthday wishes for friends and family members. Hope you like it and share them on their Birthdays.

30 Happy Birthday Wishes In Telugu

  1. నీతో స్నేహం నేనెన్నటికీ మరిచిపోలేని ఓ జ్ఞాపకం. అంతటి మంచి జ్ఞాపకం నాకు ఇచ్చిన నీకు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను 
  2. ప్రపంచంలో అన్నింటికీ హద్దు ఉందేమో కానీ.. నా ప్రేమకు లేదు.. జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా 
  3. కోటి కాంతుల చిరునవ్వుతో.. భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్తడే
  4. నాకు నచ్చినవి ఏవో తెలుసుకొని నాకు కొనిచ్చే మా అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు 
  5. ఈ సంవత్సరం నీవు అనుకున్న పనుల్లో నువ్వు విజయవంతంగా ముందుకు సాగాలని కోరుకుంటూ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 
  6. జీవితంలో ధైర్యం అంటే ఏంటో మిమ్మల్ని చూసే నేర్చుకున్నా నాన్న.. ధైర్యయంగా బతకడాన్ని పరిచయం చేసిన మీకు జన్మదిన శుభాకాంక్షలు నాన్న
  7. నువ్వు ఎల్లపుడూ హాయిగా నవ్వుతూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 
  8. ఒక మనిషి జీవితంలో గొప్ప రోజులు రెండు. ఒకటి పుట్టిన రోజు.. ఇంకోటి పుట్టినందుకు ఏదైనా సాధించిన రోజు. హ్యాపీ బర్త్ డే 
  9. బహుమతి కంటే అది ఇచ్చిన వారిని ఎప్పుడూ ప్రేమించు, అప్పుడు ప్రతీ బంధం ఎంతో అందంగా కనిపిస్తుంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు 
  10. దేవుడు మనకు జీవితాన్ని బహుమతిగా ఇచ్చాడు. బాగా జీవించడం మన చేతుల్లోనే ఉంది 
  11. నువ్వు నవ్వుతూ.. అందర్నీ నవ్విస్తూ నూరేళ్లు హాయిగా ఉండాలి. హార్దిక పుట్టిన రోజు శుభాకాంక్షలు 
  12. ఏ ఒక్కరి కోసం నిన్ను నువ్వు మార్చుకోకు.. నువ్వు నీలానే ఉండు, సంతోషంగా ఉండు. పుట్టిన రోజు శుభాకాంక్షలు 
  13. మీరు ఇతరులకు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి, షరతులు లేని ప్రేమ. పుట్టిన రోజు శుభాకాంక్షలు 
  14. మీకెంతో ప్రియమైన వారితో మీరు ఆహ్లాదంగా గడపాలని, ఈ రోజు మీ జీవితంలో మరువలేని అత్యుత్తమమైన జ్ఞాపకంగా నిలవాలని ఆశిస్తూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు 
  15. చిన్న చిరునవ్వు చాలు స్నేహం ప్రారంభం అవడానికి.. ఒక స్నేహితుడు చాలు నీ జీవితాన్ని మార్చడానికి. అలాంటి మిత్రునికి హ్యాపీ బర్తడే 
  16. నేను ఎప్పుడు బాధపడుతున్నా నన్ను ఓదార్చడానికి ముందుకు వచ్చేది నువ్వేనని నాకు తెలుసు. అలాంటి నీకు జన్మదిన శుబాకాంక్షలు 
  17. నేను ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి తికమక పడుతుంటే.. నాకు సరైన దారిని ఎన్నో సార్లు చూపించిన నీకు పుటిన రోజు శుభాకాంక్షలు మిత్రమా
  18. ఓటమి ఎన్నో పాఠాలు నేర్పుతుందన్నది ఎంత నిజమో.. ఒక మంచి స్నేహితుడు కూడా మంచి పాఠాలు నేర్పిస్తాడన్నది అంతే నిజం.. అలాంటి నీకు జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా
  19. స్నేహానికి నిలువెత్తు నిదర్శనం మన స్నేహమైతే.. ఆ స్నేహం ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం నువ్వే.. ఇలాంటి పుట్టిన రోజులు ఇంకెన్నో జరుపుకోవాలని జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా
  20. స్నేహమంటే ఇచ్చి పుచ్చుకోవడం కాదు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం అని నీ స్నేహంవల్లే తెలుసుకోగలిగాను. అంత మంచి స్నేహాన్ని పంచిన నీకు జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా 

Wishes in Telugu for Sisters 

  1. చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ ప్రియమైన చెల్లికి జన్మదిన శుభాకాంక్షలు 
  2. నువ్వు ఎల్లప్పుడూ హాయిగా నవ్వుతూ.. సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ.. ప్రియమైన అక్కకి జన్మదిన శుభాకాంక్షలు 
  3. దేవత లాంటి నీవు నాకు అక్క అయినందుకు నేను అదృష్టంగా భావిస్తున్న.. జన్మదిన శుభాకాంక్షలు అక్క
  4. మీరు నాకు సోదరిగా లభించడం ఒక అద్భుతం.. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు
  5. నా జీవితంలో ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని నింపిన మా అక్కకు జన్మదిన శుభాకాంక్షలు 

Wishes in Telugu for Mothers

  1. నా పై మీరు చూపిన ప్రేమను నేనెప్పటికీ మరిచిపోలేను.. ఎన్నో మధురమైన జ్ఞాపకాలను ఇచ్చిన మీకు జన్మదిన శుభాకాంక్షలు అమ్మ 
  2. మీ పుట్టినరోజు.. మిగిలిన 364 రోజులకంటే ఎంతో ప్రత్యేకమైనది అమ్మ. ఇలాంటి పుట్టిన రోజులు మీరు ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు అమ్మ 
  3. నా పై అందరికంటే ఎక్కువ ప్రేమ, ఆప్యాయత చూపించిన మా అందమైన అమ్మకి పుట్టిన రోజు శుభాకాంక్షలు 
  4. నువ్వు ఒక అద్భుతమైన మహిళవి.. ఈ ప్రపంచంలోని ప్రతి ఆనందాన్ని పొందగలిగే హక్కు కలిగిన వ్యక్తివి. మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అమ్మ
  5. మీ ప్రేమకు హద్దు లేదు, ఋణం తీర్చుకోలేను. మీరు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండి, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు అమ్మ.

Also Read:

Leave a Comment