Happy Vinayaka Chavithi Images in Telugu: లంబోదరుడు, విఘ్నేశ్వరుడు, వినాయకుడు ఇలా మనం ఏ పేరు తో పిలిచినా మనకి తన అనుగ్రహాన్ని ప్రసాదించే దేవుడు మరియు ఆది పూజలు అందుకే బొజ్జ గణపయ్య పండుగ ఐన వినాయక చవితి ఈ సంవస్తరం రానే వచ్చింది. మనం అందరం ప్రతి సంవత్సరం వినాయక చవితిని ఎంత గొప్పగా జరుపుకుంటామో అందరికి తెలుసు.
Happy Vinayaka Chavithi Images in Telugu
చిన్నపుడు అయితే వినాయక చవితికి బడికి సెలవులు ఇవ్వకపోవడం వలన ఎప్పుడు బడికి ఎగనామం పెట్టి గణపయ్య మండపాల్లో భజనలు చేద్దాం అని చూసేవాళ్ళం. ఇక గణపతి చందాల కోసం అయితే విధి మొత్తం తీరిగి డబ్బులు పోగేసేవాళ్ళం.
ఇప్పటి కలం లోని పిల్లలకి ఇవన్నీ పెద్దగా తెలియక పోవచ్చు, ఎందుకంటే ఇప్పటి పిల్లలు తం తమ కిడ్డీ బ్యాంకు లు మరియు సంవత్సరం మొత్తమ్ జమ చేసుకున్న డబ్బులనే చండాలుగా పోగేసుని విఘ్నేహ్వారుణ్ణి మండపాల్లో ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు.
ఇది ఒక విధం గ మంచి పరిణామమే ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి వీడికి పది గణపతి మండపాలు ఏర్పాటు చేస్తున్నారు, అందరు చందాలకు వెళ్లడం మానేసి తమ తమ ఇళ్లలో నుండే గణపతి మండపాన్ని కోసం చండని స్వామి కి దక్షిణ గ సమర్పించి పండుగను చేసుకుంటున్నారు.
ఇక మన గణపయ్య ని ప్రతిష్టించిన రోజు నుండి అందరికి పండగనే పండగ, మొత్తం కాలనీ వాళ్ళు మరియు పిల్లలు అందరు ఈ తొమ్మిది రోజులు వినాయక మండపం దగ్గరే మనకు తారసపడతారు. పిల్లలేమో పెద్ద వారితో కలిసి భజనలు చేస్తూ ప్రసాదం పంచుతూ ఆనందాన్ని పొందుతారు.
ఇక మన అడా పడుచులేమో వామి కి రక రకాల నైవేద్యాలు సమర్పిస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందుతారు. ఎంతైనా మన బొజ్జ గణపయ్య ఉండ్రాళ్ళని ఇస్తా పడినంతగా వేరే వాటిని ఇస్తా పడదు అనుకోండి అందుకే ఆడ వాళ్ళు ఎక్కువగా ఉండ్రాళ్ళను సమర్పిస్తూ ఉంటారు.
ఇక పూజలు, అర్చనలు,భజనలు తో విధి మొత్తం భక్తి లో మునిగిపోతారు. ఇక చివరి రోజు పూజలు చేసి మల్లి వచ్చే సంవత్సరం రావయ్యా అని గణపయ్య ని గంగమ్మ ఒడి చేర్చుతారు.
ఇంతటి ప్రత్యేకత సంతరించుకున్న వినాయక చవితిని మనం బంధువులు మరియు స్నేహితులతో కలిపి జరుపుకోవాలి అనుకోవటం సహజం. కానీ ఇప్పడున్న పరిస్థితుల్లో అందరం కలిసి జరుపుకోలెం కాబట్టి, మనం కూడా వర్చ్యువల్ గా అందరితో జరుపుకోవాలి అంటే సామాజిక మాధ్యమాలు ఐన వాట్సాప్ ,పేస్ బుక్ ద్వారానే సాధ్యం.
అందుకోసమే ఈ పేజీ ని మీకోసం రూపొందించాం, ఇక్కడ వినాయక చవితి కోసం రోపొందించిన ప్రత్యేక మైన ఫోటో లు మీకు అందుబాటులో ఉంటాయి, మీరు చేయ వాల్సిందల్లా వాటిని డౌన్లోడ్ చేసుకొని మీ మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు పంపి వారికి శుభాకాంక్షలు తెలియజేయడమే.కాబట్టి మీరు ఇక్కడ పెట్టిన ఫోటో ల నుండి మీకు నచ్చినవి డౌన్లోడ్ చేసుకొని మీ ప్రియమైన వారికి పంపండి.