Chia Seeds In Telugu: చియా విత్తనాలు మనకు ఎంత మేలు చేస్తాయో తెలుసా ?
You are what you eat అని ఇంగ్లిష్ లో ఒక సామెత ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి ఆహారాపు అలవాట్లలో కూడా అనేక పెను మార్పులు సంభవించాయి. అమ్మ చేతి కమ్మనైన ఇంటి వంట తిన్నన్ని రోజులు ఆరోగ్యాంగా ఉన్న మనం బయటి బజారు తిళ్ళకు అలవాటు పడ్డాం.
మరీ ముఖ్యముగా చిరుతిళ్ళు, బయటి తిళ్ళు, ఫాస్టు ఫుడ్, జంక్ ఫుడ్ కు అలవాటు పడ్డ జనం తమ శరీరాల్ని అనేక రోగాలకు ఆవాసంగా మార్చారు.
మానవ శరీరానికి ఎంతో ఆరోగ్యాన్నిచ్చే ఆహారపు పదార్థాలైన కర్రలు, సామలు , చిరు ధాన్యాలను మర్చిపోతుంది నేటి తరం. తద్వారా మానవ శరీరం తమ రోగ నిరోధక శక్తిని కోల్పోవడమే కాక అనేక ఇతర వ్యాధులైన రక్త పోటు, షుగర్, ఉబకాయం లాంటి వాటికి కేర్ ఆఫ్ అడ్రస్సయింది. దానిని అధిగమించేందుకు అనేక ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నాడు మనిషి. అలా మనిషికి ఒక కల్ప తరువుల దొరికిందే చియా గింజలు. అన్ని రకాల అనారోగ్యాలను తరిమి, మాన శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడంలో ఇవి చాలా ఉపయోగకరం.
Chia Seeds In Telugu అసలేంటీ చియా గింజలు…
సాల్వియా ఇస్పేనికా అనేది చియా గింజలకు ఉన్న శాస్త్రీయ నామం. ఇవి ఎక్కువగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాల్లో ఎక్కువగా పండే మింట్ జాతికి చెందినవి. ఇవి పరిణామంలో చాలా చిన్నగా ఉంది చూడటానికి మట్టి రంగులో ఉంటాయి. ఇవి మొదట మధ్య అమెరికా ప్రజలు పండించినట్లు చరిత్ర చెబుతుంది. అలాగే మన దేశంలో లో కూడా వీటిని పండించడం విరివిగా వృద్ధి చెందింది. రోజుకు ఒక చెంచా చియా గింజలను తీసుకోవడం వలన మనకు అనేక లాభాలు ఉన్నాయి.
చియా లోని పోషక విలువలు …
చూడటానికి అతి చిన్నగా ఉండే చియా గింజలు అనేక పోషక విలువలకు కేంద్రంగా ఉన్నాయి. వాటిలోని అనేక పోషక విలువలు మనకు ఎంతగానో ఉపయోగ పడతాయి. మరీ ముఖ్యముగా అధిక బరువుతో బాధపడుతూ, బరువు తగ్గించాలి అని అనుకునే వారికి, మాంచి శరీర ఆకృతిని పొందాలనుకునే వారికి ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి. ఇందులో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మానవ హృదయానికి అనేక మేలు చేస్తుంది.
ఇంకా ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ డి తోపాటు కాల్షియం, కాపర్, పొటాషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, ప్రోటీన్స్, మెగ్నీషియం, జింక్, సల్ఫర్, నియాసిన్, థయామిన్ వంటి ఖనిజాలు మరియు యాంటి-ఓక్సిడెంట్స్ కూడా ఉంటాయి.
చియా గింజలను ఎలా తీసుకోవాలి
ప్రతి రోజు ఉదయం లేదా సాయంత్రం ఎదో ఒక పూట మాత్రమే వీటిని తీసుకోవాలి.
ఒక చెంచాడు చియా గింజలను 10 నుండి 20 నిమిషాలపాటు నీటి నానబెట్టి తీసుకోవాల్సి ఉంటుంది.
Chia Seeds Benefits In Telugu : చియా విత్తనాలు ప్రయోజనాలు.
- దీనిలో ఉండే ఫైబర్ మన శరీరం లోని కొవ్వును కరిగించి జీర్ణ క్రియ సక్రమంగా అయ్యేలా దోహదపడుతుంది.
- కాన్సర్ కారకాల వృద్ధిని నిరోధిస్తుంది.
- వయసు పై పడటం వాళ్ళ వచ్చే ముడుతలను రాకుండా చేసి మిమ్మల్ని నిత్యా యవ్వనంగా ఉంచుతుంది.
- చియా గింజల్లోని కాల్షియం, సల్ఫర్, మెగ్నీషియం, మాంగనీస్ అధిక రక్త పోటు సమస్య ను తగ్గించటంలో ఎంతగానో దోహదపడతాయి.
- దీనిని ప్రతి రోజు తీసుకోవటం వల్ల మన చర్మ ము కూడా ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది.
- వీటిలో ఉండే పోషకాలు ఆకలిని, నిద్రను, మానసిక స్థితిని మెరుగు పరుస్తాయి.
- వీటిలో లభించే కాల్షియం వాళ్ళ ఎముకలు, దంతాలు బలంగా తయారవుతాయి.
- వీటిలో ఉండే అనేక పోషక విలువలు మానవ శరీరం లోని ఇన్సులిన్ స్థాయిని నియంత్రిస్తాయి
How To Eat Chia Seeds In Telugu : చియా విత్తనాలను ఎలా తీసుకోవాలో మీకు తెలుసా ?
ముందుగా ఒక గ్లాస్ నీళ్లు తీసుకోండి. దానిలో ఒక స్పూన్ చియా విత్తనాలు వేసి ఆ మిశ్రమాన్ని చెంచా తో కలపాలి. . ఈ మిశ్రమాన్ని ఒక 20 నిమిషాలు పాటు పక్కన ఉంచుకోవాలి. తర్వాత దానిలో సగం నిమ్మకాయ బద్ధరసం వేయాలి. ఆ తర్వాత ఒక చెంచాడు తేనె వేసి మళ్ళీ ఒకసారి ఆ మిశ్రమాన్ని బాగా కలపండి. ఇక ఇప్పుడు ఆ మిశ్రమాన్ని తాగవచ్చు.
Chia Seeds Side Effects In Telugu : చియా గింజలను ఎక్కువగా తినవచ్చా ?
- ఈ చియా గింజలను అధిక మొత్తంలో తీసుకోవడం అంత మంచిది కాదు.
- ఎక్కువగా తీసుకోవడం వలన మల బద్ధకం, పొత్తి కడుపులో నోప్పి, బ్లీడింగ్, డయేరియా లాంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
- వీటిని మనం నీటిలో వేయకుండా గింజలనే విడిగా తీసుకున్నట్లయితే, మనం తర్వాత త్రాగు నీళ్ళకి అవి ఉబ్బి మన గొంతు మింగుడుకి కూడా అడ్డంకిగా మారే అవకాశం ఉంది.
- కనుక ముందుగా మనం వీటిని నీటిలో కనీసం 10 నిమిషాలు లేక 20 నిమిషాలు నానపెట్టిన తర్వాతే తీసుకోవటం చాలా మంచిది.
ఈ సమస్యలన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా చియా గింజలను తీసుకోవచ్చు.
Read: