Balli Sastram in Telugu for Male బల్లి శాస్త్రం (గౌలి పఠన శాస్త్రం)

ఎక్కడ బల్లి పడితే ఏమవుతుంది…? వేదాల్లో అన్ని ఉన్నాయంటారు. అలాగే బల్లి శాస్త్రం గురుంచి కూడా ఉందని చెప్పారు పెద్దలు. జోతిష్యంలో గౌలి పఠన శాస్త్రం దీని గురుంచి వివరిస్తుంది. శరీరం పై బల్లి ఎక్కడ ఎప్పుడు పడితే శుభాలు అశుభాలు జరుగుతాయో ఈ శాస్త్రం ద్వారా వెల్లడించారు. ఈ బల్లి శాస్త్ర నియమాలు పురుషులకి స్త్రీలకూ వేరు వేరుగా ఉంది. సమయానికి సంబంధించి, రాత్రి సమయంలో బల్లి పడితే అశుభమేనని తెలుస్తోంది. 

Balli Sastram in Telugu for Male

పురుషులకు ప్రత్యేకంగా..

బల్లి నేరుగా పురుషుడి తలపై పడితే వివాదాలు చెలరేగుతాయంటున్నారు. తల పై భాగాన పడితే మరణ గండం ఉంటుంది. ముఖం పై పడితే ఊహించని విధంగా సంపద వచ్చి పడుతుంది. ఎడమ కంటిపైనా పడితే మంచిది, త్వరలోనే శుభవార్త వింటారు. అదే కుడి కంటి పైన పడితే నష్టం జరుగుతుంది. ఏ పని తలపెట్టిన పూర్తి కాదు, అడ్డంకులు ఎదురవుతాయి. నుదిటి మీద పడితే ప్రేమికుల నుంచి దూరమవుతారు.

పై పెదవి మీద పడితే గొడవలు జరుగుతాయి. కింది పెదవి మీద పడితే ఆర్ధింకంగా లాభ పడతారు. రెండు పెదవుల మీద పడితే ఒక మరణ వార్త వింటారు. నోటి మీద పడితే ఆరోగ్యం నశిస్తుందని సంకేతం. వీపు వెనక భాగంపై పడితే త్వరలోనే మీకు విజయం సాధించబోతున్నట్టు అర్ధం. కలలో బల్లి కనిపిస్తే, ప్రభుత్వానికి సంబంధించిన సమస్య ఏదో మిమ్మల్ని చుట్టుముట్టనుంది. మనికట్టు పై పడితే ఇంటి మరమ్మతులు జరగనున్నాయని సంకేతం. 

Also Read: Balli Sastram in Telugu for Female

పెద్దలకే అవగాహన ఎక్కువ

బల్లి చేయి మీద పడితే ఆర్ధిక నష్టం కలుగుతుందని సూచన. చేతి వేళ్ళ మీద పడితే పాత స్నేహితులు కలుస్తారు. కుడి చేతి పైన పడితే కష్టాలు, ఎడమ చేతి పైన పడితే అవమానాలు ఎదురవుతాయి. మీసాల మీద పడితే సమస్యలు మరింత జఠిలమయ్యే ప్రమాదం ఉందని బల్లి శాస్త్రం చెబుతోంధీ. బల్లికి సంబంధించి శకునం అశకునాల గురుంచి కొందరు నిరక్షరాస్యులైనప్పటికీ, మన పెద్దలకే ఎక్కువ అవగాహన ఉంది. ఈ తరంలో అనేక మంది చదువుకున్నా కూడా.. ఎక్కడ బల్లి పడితే ఏమి జరుగుతుందోననే అవగాహన అసలు లేదనే చెప్పాలి. తలపై పడితే మరణం వస్తుందని మాత్రమే అనేక మందికి తెలుసు కానీ మిగతా వాటి గురుంచి అవగాహన లేదు. 

అనుభవాలు నిజం చేస్తున్నాయి

ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న శాస్త్రంలో సత్యం ఉందా లేదా అనే ప్రశ్న తలెత్తడం సహజం. అయితే అనేక మంది అనుభవాలు వీటిని నిజం చేస్తున్నాయనేదాన్ని కొట్టిపారేయలేము. 

FAQ

1. Balli Sastram in Telugu for male Right Hand

పురుషుడి మనికట్టుపై బల్లి పడితే అలంకార ప్రాప్తి కలుగుతుంది. మోచేతిపై పడితే డబ్బు నష్టం కలుగుతుంది.

2. Balli Sastram in Telugu for male Chest

ఛాతి భాగం పై బల్లి పడితే ధన లాభం కలుగుతుంది. 

3. Balli Sastram in Telugu for male Left Hand

ఎడమ భుజం పై పడితే పది మందిలో అగౌరవం ఎదురవుతుంది. 

4. Balli Sastram in Telugu for male On Neck

మెడ భాగం పై పడితే శుభం జరుగుతుంది.

5. Balli Sastram in Telugu for male Left Leg Foot

పురుషుడి ఎడమ కాలి పై బల్లి పడితే అశుభం జరగబోతున్నట్టు సూచన

6. Balli Sastram in Telugu for male Right Leg Foot

పాదం పై బల్లి పడితే ప్రయాణం, తొడల పై పడితే దుస్తులు నాశనమవుతాయి. కాళీ వేళ్ళపై పడితే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.

7. Balli Sastram in Telugu for male Head

తలపై పడితే మరణం వెంటాడుతుంది. ముఖం పై పడితే ఆర్ధికంగా లాభాల బాట పడతారు.

Leave a Comment