బల్లి శాస్త్రం – Balli Sastram in Telugu for Female

Bigg Boss 7 Telugu Vote

స్త్రీలపై బల్లి పడితే..?

బల్లి అన్ని జీవుల్లోకి కొంత ప్రత్యేకమైనది. బల్లి పడితే శకునం, అశుకునాల గురుంచి ప్రాచీన శాస్త్రాల్లో వివరించారు, పంచాంగంలో కూడా దీని గురుంచి సమాచారం లభిస్తుంది.

బల్లి శాస్త్రం – Balli Sastram in Telugu for Female

స్త్రీలకూ ప్రత్యేకంగా బల్లి శాస్త్రం ఏం చెబుతుంది…?

Balli Sastram స్త్రీలకు ప్రత్యేకంగా వివరించడం జరిగింది. స్త్రీల పైనే బల్లి ఎక్కువగా పడే అవకాశం ఉంది, దానికి కారణం వారు గృహానికి సంబంధించిన పనులు ఎక్కువగా చేయడం. స్త్రీల తల పై బల్లి పడితే మరణ భయం ఉంటుంది. కొప్పు పై పడితే అనారోగ్యం, పిక్కలపై పడితే బంధువులు వచ్చే అవకాశం ఉంది. ఎడమ కన్నుపై పడితే భర్త ప్రేమకు దగ్గరవుతారు. అదే కుడి కన్ను పై పడితే మానసికంగా కుంగిపోతారు. పై పెదవి మీద పడితే గొడవలు, కింది పెదవి మీద పడితే కొత్త వస్తువులు దరి చేరుతాయి. వక్ష స్థలం పై పడితే సుఖం కలుగుతుంది. కుడి చెంపపై పడితే పుత్ర లాభం, ఎడమ చెవి మీద పడితే ధన లాభం. వీపు పైన పడితే మరణ వార్త , గోళ్ల పైన పడితే గొడవలు జరుగుతాయి. తొడల పై పడితే సాంసారికంగా సఖ్యత లభిస్తుంది. మోకాళ్లపై పడితే కష్టాలు ఎదురవుతాయి. కుడి కాలి పై పడితే శత్రు నాశనం జరుగుతుంది. కాలి వేళ్ళపై పడితే పుత్ర లాభం కలుగుతుంది. 

Also Read: Balli Sastram in Telugu for Male

నిర్లక్ష్యం వీడండి 

బల్లి మీద పడితే వెంటనే తల స్నానం చేయాలి. ఆవు నూనెతో దీపారాధన చేస్తూ ఇష్ట దైవాన్ని స్మరించాలి. దోషం పోవాలంటే కంచి కామాక్షి అమ్మవారి స్మరణ చేయాలి. వీలైతే కంచి కామాక్షి దేవాలయంలోని బంగారు బల్లి దర్శనం చేసుకోవాలి. బల్లి మీద పడితే నిర్లక్ష్యం చేయకూడదు. 

FAQ

1. Balli Sastram in Telugu for Female Right Hand

స్త్రీల కుడి భుజం పైన బల్లి పడితే కామ రాతి ప్రాప్తి కలుగుతుంది.

2. Balli Sastram in Telugu for Female Chest

రొమ్ము లేదా వక్ష స్థలం పై బల్లి పడితే సుఖం కలిగి మంచి జరుగుతుంది. 

3. Balli Sastram in Telugu for Female Left Hand

ఎడమ చేయి పైన పడితే.. మానసిక సమస్యలు, అనవసరమైన వత్తిడులు కలుగుతాయి

4. Balli Sastram in Telugu for Female On Neck

స్త్రీల మెడ పై బల్లి పడితే శత్రు సంహారం జరుగుతుంది. 

5. Balli Sastram in Telugu for Female Left Leg Foot

కాలి పిక్కలపై పడితే బంధువుల రాక. కాళీ మడమల పై పడితే సమస్యలు ఎదురవుతాయి. 

6. Balli Sastram in Telugu for Female Right Leg Foot

కుడి కాలి పైన పడితే ఎదురుదెబ్బలు తగిలి, నష్టపోతారు.

7. Balli Sastram in Telugu for Female Head

స్త్రీల తల పై పడితే మరణ భయం వెంటాడుతుంది, కొప్పు పై పడితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

Leave a Comment