వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే నీవే నా మంచి యేసయ్యా ప్రవహించే సెలయేరై రావా నీవు జీవ నదిలా మము తాకు యేసయ్యా నీవే నాప్రాణము నీవే నా సర్వము నీతోనే కలిసుండాలి నీలోనే నివసించాలి } నీలోనే తరియించాలి ప్రభు }॥2॥ నాప్రియ యేసు నా ప్రాణ నేస్తం } నీవు లేకుంటే నేను జీవించలేను }॥2॥వీచే॥ 1॰ ప్రేమించే నా ప్రాణం నీవే నానేస్తం కడవరకు కాపాడే నీవే నాదైవం పోషించే నాతండ్రీ నీవే నా ఆధారం కరుణ గల నీ మనసే నాకు చాలును నీ మాటలే మాకు ఉజ్జివం } నీవాక్యమే జీవ చైతన్యం }॥2॥ ॥ నాప్రియ॥ ॥వీచే గాలుల్లో॥ 2॰ ప్రతి సమయం నేపాడే నీ ప్రేమగీతం ప్రతి హృదయం పాడాలి స్తుతినైవేద్యమై నేవెళ్లే ప్రతిచోట చాటాలి నీప్రేమే నీ సిలువ సాక్షినై నీప్రేమను చూపాలి మాకోసమే నీవు మరణించి } పరలోకమే మాకు ఇచ్చావు }॥2॥ ॥నాప్రియ॥ ॥వీచే గాలుల్లో॥