Pilla O Neelu Pilaga Anilu Song Lyrics in Telugu – తెలుగు

ఈరోజుల్లో మనం అందరం యూట్యూబ్ ని చాల బాగా వాడుతున్నాం,యూట్యూబ్ కూడా చాలా మంచి తెలుగు వీడియో లను మన కోసం అందిస్తుంది.యూట్యూబ్ ఛానల్ లో బాగా ప్రాచుర్యం సంపాదించినా ఓక ఛానల్ “మన విలేజ్ షో”.

ఈ ఛానల్ పల్లెటూరు బ్యాక్ డ్రాప్ తో వివిధ అంశాల పైన వీడియో లను తీస్తుంది. ఈ ఛానల్ ద్వారా పేరు సంపాదించినా వ్యక్తుల్లో ఒకరు అనిల్ గిల .తన స్వంత ఛానెల్ లో వీడియోలు పెడుతూనే,మై విలేజ్ షో ద్వారా చాల మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు మన అనిల్. ఆయన కథానాయకుడి గ ఒక పాట రూపుదిద్దుకుంది. ఈ పాట లో కథానాయిక గ నీరజ నటించింది

Pilla O Neelu Pilaga Anilu Song Lyrics in Telugu

ఏయ్.. పిల్ల ఓ నీలు.. పిల్ల ఓ నీలు..
ఓయ్.. పిల్ల ఓ నీలు.. పిల్ల ఓ నీలు..
నిన్ను సూత్తె అయితాందే.. నా పాణం నీళ్లు…

ఓయ్.. పిలగా అనీలు.. పిలగా అనీలు..
నిను సూడకుంటే బళబళబళా కారే కన్నీళ్లు

అబ్బా! ఆ సక్కటి చెక్కిళ్ళు.. సూత్తెనే ఎక్కిళ్ళు..
నీ సిటికనేలు పట్టుకొని వస్తా అనీలు…

పిల్ల ఓ నీలు.. పిల్ల ఓ నీలు..
నిన్ను సూత్తె అయితాందే.. నా పాణం నీళ్లు…

అరెరెరే! కదిలే నీ పాదాలు.. తీసే నా ప్రాణాలు..
దూరాలు భారాలు మనకింకా ఎన్నాళ్ళు …

నువ్వు కనబడితేనే సాలు అది నాకు పదివేలు..
దగ్గరికి తీసుకుంటే ఆగదు భూమ్మీద కాలు…

ఓయ్.. పిల్ల ఓ నీలు.. పిల్ల పిల్ల నీలు..
నిన్ను సూత్తె అయితాందే.. నా పాణం నీళ్లు…

అరె! నిదరొస్తే నీ కళలు ఎదకేస్తాయ్ లే వలలు…
మెలకూ వస్తే కూడా నీ ఊహల కొట్లాటలు..

ఇగ, నువ్వెల్లే మార్గాలు అవి నాకు స్వర్గాలు..
నువ్వు లేని సంబరాలు నేనుండని నరకాలు..

అహ! పిల్ల ఓ నీలు.. పిల్ల ఓ నీలు..
నిన్ను సూత్తె అయితాందే.. నా పాణం నీళ్లు…

నీవే నా ఇష్టాలు.. నాతో అదృష్టాలు.. నీకోసం పడతాలే ఎన్నైనా కష్టాలు..
నీకొచ్చే కోపాలు.. శివరాత్రి దీపాలు.. నువ్ బుదరాగిస్తుంటే సలికాలపు తాపాలు…

ఓ పిల్ల.. పిల్ల ఓ నీలు.. పిల్ల నీలు..
నిన్ను సూత్తె అయితాందే.. నా పాణం నీళ్లు…

అరె! మనకయ్యే గొడవాలు.. అవి పాలా కడవాలు.. సలసల్లగ సాగిపోయే సాగరాల పడవాలు..
మానమధ్యన మౌనాలు మధురమైన గానాలు.. ఏంతో సేపుండవులే ఎడబాటుకు తాళాలు…

చలో చలో… పిల్ల ఓ నీలు.. పిల్ల నీలు..
నిన్ను సూత్తె అయితాందే.. నా పాణం నీళ్లు…

ఓయ్.. పిలగా అనీలు.. పిలగా అనీలు..
నిను సూడకుంటే బళబళబళా కారే కన్నీళ్లు

ఆ సక్కటి చెక్కిళ్ళు.. సూత్తెనే ఎక్కిళ్ళు..
నీ సిటికనేలు పట్టుకొని వస్తా అనీలు…

ఇక మన పాట “పిల్ల ఓ నీళ్లు పీలగా అనిలు “.. అంటూ సాగే ఈ పాట మాస్ అభిమానులందిరిని ఆకట్టు కుంటుంది.ఈ పాటను రచించి న వారు మల్లిక్ తేజ.ఇక ఈ పాట కి గాయకులూ గ మల్లిక్ తేజ మరియు మామిడి మౌనిక వ్యవహరించారు .ఈ పాట కు దర్శకతవ బాధ్యతలను ఎలామాద్రి నరసిమహం భుజానికెత్తు కున్నారు.

ఎప్పుడు హాస్య పాత్రలతో మనల్ని అలరించే అనిల్ గారు,ఈ వీడియో లో తన అభినయం,హహ భావాలతో అందరికి ఆకట్టు కుంటాడు.ఈ పాట ను ఓక జానపద గేయం గ కూడా మనం చెపుకోవచ్చు.

మాస్ ఆడియన్స్ కి మాత్రం ఈ పాట తెగ నచ్చేస్తుంది.పాట కి సంగీతం కూడా చాల అద్భుతం గ సాహిత్యానికి దగ్గట్టు గ అందించారు.ఈ పాట అభిమానులందిరిని ఆనందపరిచి మంచి మార్కులు కొట్టేసింది.

ఇక మన అనిల్ గిల గురించి చెప్పాలంటే,ఆయన మొదట గ తన ఛానల్ లో స్వీయ వీడియోలు పెడుతూ ఉండే వాడు,ఆ తర్వాత ఆయన కూడా మై విలెజ్ షో లో భాగమయ్యాడు.

ఇక అప్పటి నుండి ఆయన వెను   దిరిగి చూసుకోలేదు .ఆ మధ్య ప్రపంచం మొత్తం పైకి ఛాలెంజ్ ఊపులో ఉన్న సమయం లో మన అనిల్ గారు రైతు తో కికి ఛాలెంజ్ చేయించి ప్రపంచ వ్యాప్తంగా పేరుని సంపాందించాడు.

ఆ వీడియో ఆయనికి మంచి పేరుని టిస్కోచింది అని చెప్పడానికి ఏ మాత్రం సందేహించాల్సిన పని లేదు. మన అనిల్ గారు ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి ఎదుగుతూ దిన దిన అభివృద్ధి చెందుతున్నారు.

Leave a Comment