Manasa Manasa Song Lyrics in Telugu – Most Eligible Bachelor

Bigg Boss 7 Telugu Vote

Manasa Manasa Song Lyrics in Telugu: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్!!! అఖిల్ అక్కినేని మరియు పూజ హెగ్డే కథానాయకుడు మరియు కథానాయిక గా నటిస్తున్న సరి కొత్త చిత్రం ఇది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శత్వం వహిస్తున్నడు.ఇక ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా నీ జి ఏ 2 బ్యానర్ పైన బన్నీ వాసు,వాసు వర్మ నిర్మిస్తున్నారు.సంగీత దర్శకత్వ బాధ్యతలను గోపి సుందర్ నిర్వర్తిస్తున్నారు.

ఈ సినిమా కోసం అక్కినేని, కింగ్ నాగర్జున అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అదే విధం గా చాలా రోజుల తర్వాత అఖిల్ అక్కినేని సినిమా విడుదల అవుతుండటం తో ఆయన అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.

Manasa Manasa Song Lyrics in Telugu

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా…
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా…
నా మాట అలుసా
నేనెవ‌రో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు న‌న్నాడిపిస్తావే మ‌న‌సా…

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా…
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా…

ఏముంది త‌న‌లోన గ‌మ్మత్తు అంటే
అది దాటి మ‌త్తేదో ఉందంటు అంటూ
త‌న‌క‌న్నా అందాలు ఉన్నాయి అంటే
అందానికే తాను ఆకాశ‌మంటూ
నువ్వే నా మాట… హే…
నువ్వే నా మాట విన‌కుంటే మ‌న‌సా…
తానే నీ మాట వింటుందా ఆశ‌
నా మాట అలుసా.. నేనెవరో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు నన్నాడిపిస్తావే మ‌న‌సా…

మ‌న‌సా మ‌న‌సా మ‌న‌సారా బ్రతిమాలా త‌న వ‌ల‌లో ప‌డ‌బోకే మ‌న‌సా…
పిలిచా అరిచా అయినా నువ్ విన‌కుండా త‌న‌వైపు వెల‌తావ మ‌న‌సా…

తెలివంత నా సొంత‌మనుకుంటు తిరిగా
త‌న‌ముందు నుంచుంటే నా పేరు మ‌రిచా
ఆ మాట‌లే వింటు మ‌తిపోయి నిలిచా
బ‌దులెక్కలుంద‌ంటు ప్రతి చోట వెతికా
త‌న‌తో ఉండే… హే…
తనతో ఉండే ఒక్కొక్క నిమిషం మ‌ర‌లా మ‌ర‌లా పుడ‌తావా మ‌న‌సా
నా మాట అలుసా నేన‌వ‌రో తెలుసా
నాతోనే ఉంటావు న‌న్నే న‌డిపిస్తావు న‌న్నాడిపిస్తావే మ‌న‌సా…

ఇక ఈ సినిమా ను 2020 ఏప్రిల్ లో విడుదల చేయడం కోసం సన్నాహకలు జరుగుతున్నాయి.ఈ సినిమా నీ అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇక ఈ మధ్యే ఈ సినిమా కి సంబంధించి ఒక పాటను విడుదల చేశారు.మనసా మనసా అంటూ సాగే ఈ పాట ను అభిమానుల.కోసం చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఈ.సినిమా ను మంచి గాయకుడి గా పేరు సంపందించిన సిడ్ శ్రీరామ్ ఆలపించారు.

‘‘మ‌న‌సా.. మ‌నసా.. మ‌న‌సారా బ్రతిమాలా త‌న‌వ‌లలో ప‌డ‌బోకే మ‌న‌సా’’ అంటూ సాగే ఈ సాంగ్ చాలా బాగుంది. ఇది కూడా మరో సెన్సేషన్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ పాటకు సురేంద్ర కృష్ణ సాహిత్యం అందించారు.ప్రస్తుతం హైద‌ర‌బాద్ ప‌రిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. హీరో గా తన కెరీర్ మొదలుపెట్టి 5 ఏళ్లు అయినా ఇంతవరకు ఒక్క హిట్ కూడా సాధించలేదు.

మొదటి సినిమా అఖిల్ డిజాస్టర్ గా నిలువగా,ఇక మిగతా రెండు సినిమాలు అయిన హెలో మరియు మిస్టర్ మజ్ను అంతంత మాత్రం గానే ఆడాయి.కాబట్టి అఖిల్ కూడా ఈ సినిమా తో అయిన విజయాన్ని సాధించి తన మార్క్ చుపెట్టలి అని భావిస్తున్నాడు.

ఈ సినిమా అఖిల్ కి భారీ విజయాన్ని చేకూరుస్తుంది అని భావిస్తున్నాం.ఈ సినిమా విజయం తో అయిన అఖిల్ తెలుగు సినీ ఇండస్ట్రీ లో మంచి స్థానాన్ని తన కంటు ఏర్పరచు కుంతదని భావిస్తున్నాం.ఇక అఖిల్ అభిమానులకి తోడుగా ఆయన సినిమా విజయం వెనుక అక్కినేని అభిమానులు,నగ చైతన్య అభిమానులు,నాగర్జున అభిమానులతో పాటు గా అక్కినేని సమంత అభిమానులు కూడా ఉండటం అఖిల్ కి కలిసొచ్చే అంశం.

Manasa Manasa Song Lyrics in Telugu

Leave a Comment