Happy Vinayaka Chavithi GIF

Bigg Boss 7 Telugu Vote

Happy Vinayaka Chavithi GIF: హిందువుల అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి అయిన వినాయక చవితి రానే వచ్చేసింది. ప్రతి సంవత్సరం సమానం అందరము ఎంతో ఆతృత తో ఎదురు చూసే పండుగ వినాయక చవితి. వినాయకుడు,విఘ్నేశ్వరుడు, లంబోదరుడు ఇలా వివిధ నామాలతో మనం పిల్చుకునే బుజ్జి గణపయ్య జన్మ దినమే ఈ వినాయక చవితి.

 హిందువులు జరుపుకునే పండుగనులలో ఇటుది ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఎందుకంటే హిందూ దేవుళ్ళ పూజ ఏదైనా మొదట గ ఆది దేవుడు అయిన వినాయకుడి పూజ తోనే ప్రారంభం అవుతుంది. అంతటి విశిష్టత కలిగిన విఘ్నేశ్వరుడి పండగ మరి ముఖ్యమైనదే కదా.

Happy Vinayaka Chavithi GIF (Telugu)

మనం గనక బొజ్జ గణపయ్య వ్రత కథ ని చూస్తే మనకు చాల గొప్ప విషయాలు తెలుస్తాయి. గణాలకు అధిపతి ని ఎన్నుకోవాల్సి వచ్చినపుడు మన విఘ్నేశ్వరుడికి మరియు కుమార స్వామి కి మధ్య జరిగే సన్నివేశం అందరికి ఎంతో మంచి విషయాన్నీ తెలియజేస్తుంది. ఎవరైతే భూ మండలాన్ని మూడు సార్లు చుట్టి వస్తారో వారికే గణాల ఆధిపత్యం ఇవ్వాలని అందరు తీర్మానించుతారు.

ఇక పోటీ మొదలవ్వగానే కుమార స్వామి తన వాహనం అయిన నెమలి పైన వెంటనే దూసుకుపోతాడు. ఇక మన గణపయ్య ఏమో తన వాహనం ఐన ఎలుక తో అక్కడే దీర్ఘం గ ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే తన వాహనం తమ్ముని వాహనం తో పోటీ పడలేదు.

అప్పుడే మన గణపయ్య వెంటనే తన తాకాలి దండ్రులు ఐన శివ పార్వతుల చుట్టు మూడు ప్రదక్షిణాలు చేస్తాడు. ఇక్కడ వినాయకుడు ప్రదక్షిణ చేస్తున్న సమయం లోనే అక్కడ కుమారస్వామి కి తన కన్నా ముందు ఉన్నట్టుగా కనిపిస్తాడు. చివరికి గణపయ్య తల్లి దండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణాలు పూర్తి చేసి పోటీ లో గెలుస్తాడు. అప్పుడు కుమారస్వామి గణపతి ని నీవు నాకంటే ఎలా ముందుగా భూమండళ్లని చుట్టి రా గలిగావు అని అడుగగా, వినాయకుడు ఇలా సెలవిస్తాడు.

మన కాళ్ళ ముందు కనిపించే తల్లి డందులే సర్వస్వం, వీరిని చుట్టి వచ్చిన మనం ప్రపంచాన్ని మొత్తం చుట్టి వచ్చినాటే అందుకే నేను పోటీ లో నెగ్గి గలిగాను అని సెలవిసితాడు.

 ఇక్కడ మనం మన గణపాయ మేధో శక్తిని  మరియు సమయ స్ఫూర్తిని గమనించ వచ్చు. అందుకే మనం అందరం ప్రతి సంవత్సరం ఆయన్ని మనకు బుద్దిని ప్రసాదించమని వేడుకుంటాము. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మనం అనడం గా వినాయక చవితిని జరుపుకుందాం.

మనకు దూరం గ ఉన్నవారికి కూడా వినాయకుడి గిఫ్ లు పంపించి వారికి కూడా మనం శుభాకాంక్షలు తెలియజేస్తుండడం. ఇలా చేయడం వల్ల మనం కూడా ఈ పండుగని వారితో కలిసి జరుపుకున్న అనుభూతిని పొందవచ్చు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ప్రయోగించుకొని అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపి అందరి పైన ఆ ఆది దేవుడు ఐన వినాయకుడి దీవెనలు ఉండాలని ప్రార్థిద్దాం.

Happy Vinayaka Chavithi GIF

Leave a Comment