Moral Stories for Children in Telugu: కధలు మన జీవితం లో చాలా ముఖ్యం. కధలు మనకి పాఠాలని నేర్పుతాయి, మనం చిన్న పిల్లలకి మంచి నీతి పాఠాలు నేర్పాలి. దాని ద్వారా మనం మన పిల్లలని మంచి దారి లో ఉంచవచ్చు.
పిల్లలకి కధలు అంతే చాలాఇష్టం, పిల్లలకి చిన్నపుడు ఊహ శక్తి ఎక్కువ ఉంటది. అందుకీ వాళ్ళు కధలు చాలా ఆసక్తిగా వింటారు.
తెలుగు హుంగామ మీ పిల్లల కోసం మంచి నీతి కథలు అందచేస్తుంది.
Moral Stories for Children in Telugu [New Stories]
1. నాలుగు ఆవులు
ఒక ఊరి చీవర పచ్చని మైదానంలో నాలుగు ఆవులు ఎంతో సంతోషంగా ఆనదంగా ఉన్నాయి. అవ్వి కలిసి గడ్డి మేయటం, కలిసి తిరగడం చేసేవి. ఇవి ఎపుడు కలిసి ఉండేవి కాబట్టి పులి, సింహాలు వీటి జోలికి రావాలి అన్న రాలేకపోయేవి.
కొన్ని రోజుల తర్వాత వాటి మధ్య ఏదో గొడవ జరగడం వాళ్ళ, నాలుగు ఆవులు నాలుగు దిక్కులు గడ్డి తినడానికి వెలయి.
ఇదే సరియన సమయం అన్ని ఒక పులి, సింహం వాటిని వేటాడి చంపేశాయి.
దీనిలో నీతి ఏమిటి అంతే ఐక్యతమే మనకి ఉన్న బలం
2. నిజమయిన స్నేహితుడు
శ్రీ కృష్ణుడు,సుధామ చిన్ననాటి స్నేహితులు, కృష్ణుడు వృద్ధి చెంది, గొప్పవాడు అయ్యాడు. కానీ సుధామ చాలా బీద వాడు తాను ఒక చిన్న గుడిసెలో తన భార్య పిల్లలతో ఉండేవాడు. తాను తన పిలలల ఆకలి కూడా తీర్చలేని స్థితిలో ఉన్నాడు.
అప్పుడు తన భార్య కృష్ణుడు దగరికి వెళ్లి సహాయం అడగమని చెపింది. సుధామ అప్పుడు తన స్నేహితుడ్ని సహాయం ఎల్లా అడగాలి అన్ని మొహమాట పడదు. అక్కరికి అన్ని తెగించి ద్వారకకు వెళ్ళాడు.
సుధామ భార్య కృష్ణుడికి ఇష్టమని అటుకులు చేసింది. ద్వారకా వద్ద ఉన్న ద్వారాపాలకులు సుధామ చినిగిన పంచ, తన అవతారం చూసి, లోపలికి పంపలేదు. ఈ విషయం తెలిసిన కృష్ణుడు వెంటనే తన పనులు అన్ని ఆపేసి తన మిత్రుడు అయినా సుధామ ని ఎంతో ప్రేమగా కౌగిలించుకొని లోపలికి తీస్కొని వెళ్లి ఎన్నో మర్యాదలు చేసాడు.
వారి చిన్నపాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని నవ్వుకున్నారు. అంత గోప మనిషి అయినా కృష్ణుడు తాను తెచ్చిన అటుకులు ఇవ్వడానికి సిగ్గు పడదు సుధామ. దాని గమనించిన కృష్ణుడు అడిగి మరి తిన్నాడు
తన స్నేహితుడి ప్రేమకి సుధామ చాలా సంతోషించి, తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. వచ్చేసరికి అతని గుడిసె పోయి మంచి భవనం, పిల్లలు భార్య మంచి దుస్తులు ధరించి ఉన్నారు. కృష్ణుడు తనకి ఏమి కావాలో ఇచ్చేసాడు, కానీ సుధామ సహాయం అడగలేదు. ఇదే నిజమయిన స్నేహం అంతే అన్ని సంతోషించాడు.
ఇందులో నీతి ఏమిటి అంతే నిజమయిన స్నేహం ఆస్తులు అంతస్తులు కన్నా విలువ అయినవి.
౩. నాన్న అదిగో తోడేలు
ఒక చిన్న గుట్ట మీద ఒక చిన్న పలెటూరు ఉండేది. ఒక రైతు, తన కొడుకుని గోరెలు కాయటానికి తనతో తీసుకొనివెళ్ళాడు. పిల్లవాడిని గోరెలు చూస్తూ ఉండమని, తోడేలు వస్తే వెంటనే గట్టిగ అరవమని చేపి, రైతు కొద్దీ దూరంలో ఉన్న తన పోళ్ళంలో పని చేయడానికి వెళ్ళిపోయాడు.
కొద్దిసేపు అయ్యాక ఆ పిల్లవాడికి ఏమి తోచలేదు, నాన్నని ఆటపాటిదామని నాన్న అదిగో తోడేలు అదిగో తోడేలు అంటూ గట్టిగ అరిచాడు. అది విన్న వెంటనె కంగురుగా రైతు తన మిత్రులతో కర్రలుపట్టుకొని వచ్చాడు ” ఏది తోడేలు?” అన్ని అడిగాడు. పిల్లడు నవ్వుతూ ” ఊరికే అరిచా” అన్నాడు.
” ఇళ్ల ఊరికే అరవకు, మా పని పాడుచేయకు” అన్ని రైతు మందలించాడు.
మల్లి కొద్దిసేపటికి పిల్లవాడు ” అదిగో తోడేలు ” అన్ని అరిచాడు. రెండోసారి కూడా రైతు తన స్నేహితులతో వచ్చి మోసపోయాడు.
మూడోసారి నిజంగానే ఒక తోడేలు వచ్చి ఒక గోరె పిల్లని చంపేసి అడవిలోకి తీస్కొని వెళ్ళింది. ఇపుడు పిల్లవాడు భయంతో గట్టిగ ” అదిగో తోడేలు” అన్ని అరిచాడు. కానీ ఈసారి ఎవరు రాలేదు.
పని ముగించుకొని వచ్చిన రైతు తన కొడుకు ఏడుస్తూ ఉండటం చూసి ” ఎందుకు ఏడుస్తునవ్?” అన్ని అడిగాడు. అప్పుడు పిల్లవాడు ” ఈ సారి నిజంగానే తోడేలు వచ్చింది. నేను గట్టిగ అరిచినా మీరు అందరూ ఎందుకు రాలేదు” నేను భయం తో ఇక్కడ కూర్చుండిపోయా.
అప్పుడు అది విన్న రైతు ” అబద్ధాలు ఆడే వాడి మాట ఎవరు నమ్మారు, పటించుకోరు.’ అన్ని చేపి ఓదార్చి, మిగిలిన గోరెలని తోలుకొని ఇద్దరు ఇంటికి పోయారు.
ఇందులో నీతి ఏమిటి అంతే అబద్ధాలు ఆదేవాలని ఎవరు నమ్మారు, వాళ్లునిజం చేపిన ఎవరు నమ్మారు.
4. బాతు బంగారు గుడ్డు
ఒక ఊళ్ళో ఒక రైతు ఉండే వాడు. వాడి దగ్గర ఒక తెల్ల బాతు ఉండేది. అది ప్రతి రోజు ఒక బంగారు గ్రుడ్డు పెట్టేది . ఆ బంగారు గ్రుడ్డుని అమ్ముకుని వాడు హాయిగా ఉండేవాడు చల్ల కాలక్షేపం చేస్తూ ఉండేవాడు.
కానీ కొంతకాలం గడచిన తరవాత వాడి కి చుట్టూ ప్రక్కల ఉండే ధనవంతులు కన్నా గొప్ప ధనవంతుడు కావాలని కోరిక కలిగింది. వెంటనే వాడికి ఒక ఆలోచన వచ్చింది .”ఈ బాతు రోజు ఒక గ్రుడ్డు మాత్రమే ఇస్తోంది. దీని కడుపులో ఇంకా ఎన్ని గ్రుడ్లు ఉన్నాయో? అవన్నీ నేను ఒకేసారి తీసుకుని గొప్ప ధనవంతుణ్ణి అయిపోవచ్చు కదా అన్ని , దాని కడుపు కోసేసి ఆ గ్రుడ్లన్నీ తీసేసు కుంటాను” అని అనుకున్నాడు.
ఆ ఆలోచన రావటమే వెంటనే ఒక కత్తి తీసుకుని బాతుని కడుపు కోసి చూశాడు. లోపల ఒక్క గ్రుడ్డు కూడా లేదు. ఆ బాతు కాస్త చచ్చిపోయింది. చక్కగా రోజుకో గ్రుడ్డు తీసుకుని ఉంటే ఎంత బాగుండేది, ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది గదా, అని విచారించ సాగాడు.
ఇందులో నీతి ఏమిటి అంతే దురాశ ఎప్పుడూ దుఃఖాన్నే మిగులుస్తుంది. పని చెసేముందే ఆలోచించాలి
5. బంగారు స్పర్శ
ఒక ఊరిలో ఒక వ్యతికి బంగారం అంటే చల్ల ఇష్టం. ఒక రోజు ఆ వ్యక్తి ఒక దేవతను పూజించి వరం కోరుకున్నాడు. తన పూజకు మెచ్చి ఆ దేవత ఏదైనా వరం కోరుకుమనది. ఆ వ్యక్తి అసలు ఆలోచించకుండా ” నేను ఏది నా చేతితో తాకితే, అది బంగారంగా మారాలి” అన్ని కోరుకున్నాడు.
దేవత తాను కోరుకున్న వరం ఇచ్చేసింది, ఆ వ్యక్తి మహా సంతోషముతో ఉపొంగిపోయాడు. తనకి చాలా ఆకలి వేసింది, ఎదురుగా ఉన్న ఒక ఆపిల్ పండుని తిందాం అన్ని దాని ముటుకునాడు, కానీ అది బంగారంగా మారిపోయింది. దీని చూసి ఆ వ్యక్తి చాలా మురిసిపోయాడు. ఇంటికి వెళ్లి తిందాం అన్ని గబ్బా గబ్బా ఇంటికి వెళ్ళాడు.
ఇంటికి వెళ్లి అందంతో అన్ని వస్తువులని పాటేసుకున్నాడు, అన్ని బంగారంగా మారిపోయాయి
ఆ ఆంధములో తన అమ్మాయి ని చూసాడు. పరమానదుముతో తనని కూడా పాటేసుకున్నాడు, అంతే ఆ పాపా కూడా ప్రాణం లేని ఒక బంగారు బొమ్మల మారిపోయింది. అప్పుడు ఆ వ్యక్తి తాను చేసిన తప్పుని గ్రహించి మళ్ళిఆ దేవతను ప్రదించాడు.
“నాకీ శక్తి వొద్దు. నా పిల్ల కి మామూలు రూపం రావాలని,” ప్రార్ధించాడు. బంగారంగా మారినవన్నీ మళ్ళీ యధా రూపం లోకి వొచ్చాయి. అమ్మాయిని చూసుకుని ఆ వ్యక్తి మురిసిపోయాడు.
ఇందులో నీతి ఏమిటి అంతే అతియాశకి పోవద్దు, మనుకున్నవాటితో సంతోషంగా ఉండటం మంచిది.
Also Read:
- Friendship Stories in Telugu (ఫ్రెండ్షిప్ స్టోరీస్)
- తెలుగు సినిమా పజిల్స్ | Telugu Cinema Puzzles | Whatsapp