How To Make Ugadi Pachadi In Telugu – తెలుగులో

Bigg Boss 7 Telugu Vote

Ugadi Pachadi in Telugu

How To Make Ugadi Pachadi In Telugu
How To Make Ugadi Pachadi In Telugu

ఉగాది పచ్చడి విశిష్టత (Ugadi Pachadi Specialty)

మన తెలుగు  వారికీ ముఖ్యమైన ఉగాది .మన తెలుగు వారి విశ్వాసం ప్రకారం ప్రస్తుత యుగం ఉగాది రోజే మొదలయ్యింది అని చెబుతూ ఉంటారు.అలంటి ఉగాది ని తెలుగు  వారు భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు.ఉగాది హిందూ పండుగలలో ఎంతో విశిష్ట మైనది .హిందువుల విశ్వాసం ప్రకారం ఉగాది రోజే  కొత్త  సంవత్సరం ఆరంభం  అవుతుంది.

ప్రకృతి లో కూడా మార్పులు సంబవించి ,చెట్లకు కూడా పాత ఆకులు  రాలిపోయి కొత్త చిగుళ్లు రావడం ఉగాది తోనే మొదలవుతుంది .ఉగాది రోజు ప్రజలు అందరు సుఖ సంతోషలతో ,కుటుంబ సభ్యులతో ఆనందం గా గడుపుతారు.

ఉగాది గురించి ప్రస్తావించినపుడల్లా మనం ముహ్యం గా చెప్పుకునేది ఉగాది పచ్చడి .ఏ ఉగాది పచ్చడి ని కొన్ని ప్రత్యేకమైన పదార్థాలతో కేవలం ఉగాది రోజున మాత్రమే తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత ఈ ప్రసాదన్నీ దేవుడికి నివేదించి ,ఆ తర్వాత అందరు సేవిస్తారు.

ఈరోజు  మనం ఉగాది పచ్చడిని ఎలా తాయారు చేతిలో చూద్దాం .

ఉగాది పచ్చడి తాయారు చేసే విధానం (How to Make Ugadi Pachadi in Telugu)

ఈ ఉగాది పచ్చడి తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు రుచులతో కూడిన షడ్రుచుల సమ్మేళనం గా చెప్పవచ్చు .

కావాల్సిన పదార్థాలు (Ingredients Required)

లేత మామిడికాయ (Green Raw Mango) – 1

వేప పువ్వు (Neem Flowers) – 1/2 కప్ప

అరటిపండు (Banana) – 1

చెరకు రసం (Sugarcane Juice) – 1/2 కప్పు

కొబ్బరి  తురుము (Coconut Tender) – 1/2 కప్పు

కొత్త చింతపండు (Tamarind) – 100 గ్రాములు

కొత్త బెల్లం (Jaggery) – 100 గ్రాములు

మిరపకాయలు లేదా  కొత్త కారం పొడి (Chilies or Red Chili Powder) – 2

ఉప్పు (Salt) – తగినంత

తయారీ విధానం (Procedure)

ముందుగా చింతపండును ఒక పది నిముషాలు నీళ్లలో నాన బెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత చింత పండుని తీసేసి చింత పండు రసాన్ని వడకట్టి పక్కన పెట్టుకోవాలి .ఇప్పుడు లేత మామిడి కాయని తీసుకొని ,దాన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కల్లా కోసుకొని పక్కన ఉంచుకోవాలి.కొబ్బరిని కూడా తురుముకొని పక్కన ఉంచుకోవాలి.

ఒక వేళా మీరు మిరపకాయల్ని వాడుతున్నారు అయితే వాటిని  కూడా ముక్కల్లాగా కోసుకొని పక్కన ఉంచుకోవాలి. వేప పువ్వు ని   చెట్ల కడాల నుండి వేరు చేసి శుభ్రంగా కాడిని పక్కన ఉంచుకోవాలి .అరటి పండుని కూడా చిన్న చిన్న ముక్కలాగా కోసుకోవాలి.

ఇప్పుడు కొత్త బెల్లాన్ని తీసుకొని దాన్ని సన్నగా తురుము కొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకోని దాంట్లో చెరకు రసం ,కారప్పొడి లేదా మిరపకాయ ముక్కలు ,కొబ్బరి తురుము ,మామిడి కయ ముక్కలు ,అరటి పండు ముక్కలు ,వేప పువ్వు ,చింత పండు రసం ,బెల్లం తురుము వేసుకొని చివర్లో తగినంత ఉప్పు వెస్కొని కలపాలి.ఇప్పుడు మీ ఉగాది పచ్చడి తయారు అయినట్టే.

దీన్ని లక్ష్మి దేవి కి నైవేద్యం గ సమర్పించి, అందరికి పంచాలి. రుచికి తగ్గట్టు గ పదార్థాలను వేసుకోవాలి. ఈ పహాడీ సేవించిన వారికి ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని మరియు ఆ లక్ష్మి దేవి కృప వారి పై ఎల్లప్పుడూ ఉంటుంది అని ప్రజలు నమ్ముతారు.

You may also like:

ugadi pachadi wikipedia in telugu

how to prepare ugadi pachadi in hindi

ugadi pachadi preparation in telugu matter

about ugadi in telugu

how to make ugadi pachadi wikipedia

6 ruchulu in telugu

ugadi pachadi ingredients images

ugadi pachadi ruchulu in telugu

Tutorials

Ugadi Pachadi Recipe in Telangana Style

Ugadi Pachadi Recipe in Andhra Style

This is the end of “How To Make Ugadi Pachadi In Telugu”, hope you liked it. Once again happy Ugadi to everyone, stay blessed and keep smiling.

Leave a Comment