Nuvvena naa nuvvena lyrics in Telugu – Anand Telugu Movie Song

Bigg Boss 7 Telugu Vote

Nuvvena naa nuvvena lyrics in Telugu: ఆనంద్ !! తెలుగు సినిమా లో ఈ సినిమా కి ప్రత్యేకమైన స్థానం ఉంది.ఆనంద్ సినిమా ని శేఖర్ కమ్ముల రచించి ,తానే సవయం గ దర్శకత్వం వహించాడు.అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పైన ఈ సినిమా ని నిర్మించడం అనేది జరిగింది.2004 లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది అనడం లో ఆ మాత్రం సందేహం లేదు.ఈ సినిమా లో ని ముఖ్య పాత్రలను కమలిని ముఖర్జీ మరియు రాజా పోషించారు.180 నిమిషాల నిడివి గల ఈ సినిమా అందరిని చివరి వరకు ఆకట్టు కుంటుంది .శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించడం ఈ సినిమా కి చాల పెద్ద అనుకూలమైన విషయం .ఈ కథ ని వేరే ఎవరు తీసిన కూడా సినిమా ఇంత బాగా వచ్చేది కాదేమో అనిపిస్తుంది ,అంత బాగా ఈ సినిమాని తీశారు దర్శకుడు శేఖర్ కమ్ముల .ప్రేమ కావ్యాలు,కాలేజీ కి సంబందించిన సినిమా లు పక్క పల్లెటూరి సినిమా లు తీయటం లో శేఖర్ కమ్ముల దిట్ట అనే విషయం ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది.అంతటి గొప్ప దర్శకుడు మన శేఖర్ కమ్ముల గారు .

Nuvvena naa nuvvena lyrics in nuvvena naa nuvvena lyrics in teluguTelugu

నువ్వేనా..నా నువ్వేనా..
నువ్వేనా..నాకు నువ్వేనా..
సూర్యుడల్లె సూది గుచ్చే సుప్రభాతమేనా
మాటలాడే చూపులన్ని మౌనరాగమేనా
చేరువైన దూరమైన ఆనందమేనా...
చేరువైన దూరమైన ఆనందమేనా...
ఆనందమేనా..ఆనందమేనా..

నువ్వేనా..నా నువ్వేనా..
నువ్వేనా..నాకు నువ్వేనా..

మేఘమల్లె సాగి వచ్చి దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచి మెరిసి మాయమౌతావు
కలలేనా..కన్నీరేనా..
ఆ..తేనెటీగ లాగ కుట్టి తీపి మంట రేపుతావు
పువ్వులాంటి గుండెలోన దారమల్లె దాగుతావు
నేనేనా..నీ రూపేనా..

చేరువైన దూరమైన ఆనందమేనా...
చేరువైన దూరమైన ఆనందమేనా...
ఆనందమేనా..ఆనందమేనా..
నువ్వేనా..నా నువ్వేనా..
నువ్వేనా..నాకు నువ్వేనా..

ఆ..కోయిలల్లే వచ్చి ఏదో
కొత్త పాట నేర్పుతావు
కొమ్మగొంతులోన గుండె
కొట్టుకుంటే నవ్వుతావు
ఏ రాగం..ఇది ఏ తాళం..
ఆ..మసక ఎన్నెలల్లె నీవు ఇసుక తిన్నె చేరుతావు
గసగసాల కౌగిలంత గుసగుసల్లె మారుతావు
ప్రేమంటే..నీ ప్రేమేనా..

చేరువైన దూరమైన ఆనందమేనా...
చేరువైన దూరమైన ఆనందమేనా...
ఆనందమేనా..ఆనందమేనా..
నువ్వేనా..నా నువ్వేనా..
నువ్వేనా..నాకు నువ్వేనా..

ఇక మన సంగీతం విషయానికి వస్తే,ఈ సినిమా లో సంగీతం కూడా చాల ద్బుతం గ ఉందని చెప్పొచ్చు.ఈ సినిమా కి కే ఎం రాధాకృష్ణ గారు స్వరాలను అందించి సంగీతం అందించారు.ఒక సంగీత దర్శకుడి గ అయన కర్తవ్యం ని అయన విజయవంతం గ పూర్తి చేసారు.”నువ్వేనా నా నువ్వేనా”అంటూ సాగే పాట మాత్రం ప్రేక్షకుల మనసు ను దోచింది అని ఏ మాత్రం సందేహం లేకుండా చూపొచ్చు.ఈ సినిమా మొత్తానికి ఈ పాట నే మనం ఒక హైలైట్ గ చెప్పవచ్చు.అద్భుతమైన సంగీతం తో  పటు గ మంచి స్వరం తో ఆలపించడం కూడా ఈ పాట హిట్ అవ్వడానికి దోహద పడింది.మిగతా పాటలు కూడా “నువ్వేనా న నువ్వేనా” కి ఏ మాత్రం తీసిపోని విధం గ రాయించి,సంగీతం సమకూర్చి,పాడించారు మన దర్శకుడు శేఖర్ కమ్ముల గారు.రాధాకృష్ణన్ గారు ప్రెకషకులను తన స్వర బాణీలతో ఊహల్లో తేలేలా చేయడం ఒక మధురానుభూతి.పాట  ల ఎంపిక మరియు పాట పాడాల్సిన వారిని ఎంపిక చేయడం లో శేఖర్ కమ్ముల మరియు మన సంగీత దర్శకుడు రాధాకృష్ణ పడ్డ బాధ ను మనం అర్థం చేస్కోవచ్చు ఎందుకంటే దాని ఫలితం గానే మన అందరికి ఇంత మంచి సంగీతం కలిగిన సినిమా లభించింది .పాటలు పడిన వారు కూడా సంగీతానికి దగ్గట్టు తమ తమ స్వరాన్ని అన్వయించుకొని పడటం తో పాటలు కూడా అద్భుతం గ వచ్చాయి.

ఇక ఈ చిత్రం మంచి కథనం,సంగీతం తో పాటు నటన కూడా తోడవడం తో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్నే సాధించింది.ఒక క్లాసికల్ సినిమా ని ఇంత బాగా ఎవరు తీయలేరేమో అనుకుంటున్నా తరుణం లో నేను ఉన్నాను అంటూ శేఖర్ కమ్ముల ముందుకు వచ్చి ఈ ప్రేమ కావ్యాన్ని సినిమ మలచడం తెలుగు ఇండస్ట్రీ గర్వించ డాగ్ విజయాన్ని అందించడం అభినందనీయం.కమలిని ముఖర్జీ మరియు రాజా అయితే ఈ సినిమా మొత్తం లో పాత్ర లకి సరైన న్యాయం చేసారు అనేది అక్షర సత్యం.ఇలా అందరు చాల కస్టపడి,తమ కృషి తో సినిమా ఇంతటి ఘానా విజయాన్ని నడుకునేలా చేసారు.దర్శకునికి సినిమా పైన ఉన్న పట్టు,కథ మీదఆ ఉన్న నమ్మకం కూడా అతన్ని ఇంత బాగా సినిమా తీయడానికిప్రేరేపించాయి అని చెప్పుకోవచ్చు.ఒకవేళ శేఖర్ కమ్ముల గనక ఈ సినిమా తీయకపోయి ఉంటె తెలుగు ప్రేక్షకులు అందరు ఒక మంచి సినిమా ని మిస్ అయ్యారు అనే భావం మనలో కలుగక మానదు.అలంటి సినిమా ని మన అందరికి పరిచయం చేసిన దర్శకుడు షెకాహ్ర్ కమ్ముల గారిని మనం అందరం అభినందించాల్సిందే.

Nuvvena naa nuvvena lyrics in Telugu [Full Lyrical Video]

nuvvena naa nuvvena lyrics in telugu

Leave a Comment