Killi Veddam Lolli Cheddam Lyrics in Telugu: అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి!! 2020 లో విడుదల కాబోతున్న తెలుగు చిత్రాల్లో ఆసక్తి నీ రేకించే చిత్రం ఇది. ఈ చిత్రం లో ధన్య బాలకృష్ణ,సిద్ది ఇడ్నాని, త్రిధ చౌదరి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 6 2020 రోజున విడుదల కానుంది.
Killi Veddam Lolli Cheddam Lyrical Video
ఈ చిత్రానికి బాలు అడుసుమిల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా నీ హిమ వెలగపూడి,వేగ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.ఈ.సినిమా సంగీత దర్శకత్వ బాధ్యతలను వికాస్ బడిస నిర్వర్తిస్తున్నారు.
ఈక ఈ మధ్యే ఈ చిత్రానికి సంబంధించిన ఒక పాటను చిత్రం యూనిట్ అభిమానుల కోసం విడుదల చేసింది. కిల్లి వేద్దాం లొల్లి చేద్దాం…అంటూ సాగే ఈ మాస్ పాట అభిమానులను ఆకట్టుకుంది.
ఈ పాటను తెలుగు రాపర్ గా పేరు సంపాదించిన బిగ్ బాస్ 3 ఫేమ్ రోల్ రిడ,విష్ణు ప్రియ రవి,సమీరా భరద్వాజ్ మరియు వికాస్ బడిశా ఆలపించారు.ఈ పాటకి సాహిత్యాన్ని కూడా మన రాపర్ రోల్ రిద అందించడం మరొక విశేషం.
ఈ సినిమా కి ఈ పాట మాస్ సాంగ్ లాగ వ్యవహరించ బడుతుంది.సినిమా లో ఐటెం సాంగ్ కి బదులుగా ఈ పాట నీ పెట్టారు అని మనకు పాట నీ తీసిన విధానాన్ని బట్టి తెలుస్తుంది.
ఇక సినిమా విషయానికి వస్తే 2 గంటల 2 నిమిషాలు నిడివి గల ఈ సినిమా హాస్య మరియు థ్రిల్లర్ చిత్రం గా చేపుకోవచ్చు.ముగ్గురు యువతులు తమ స్నేహితురాలి పెళ్ళి కోసం బయల్దేరి గోవా కి వెళ్తుండగా ఒక మర్డర్ ట్రాప్ లో చిక్కుకుంటారు.
ఆమర్డర్ ట్రాప్ నుండి ఈ ముగ్గురు ఎలా బయట పడ్డారు అనేది సినిమా ముఖ్య కథాంశం.ఈ సినిమా కోసం చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఈ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా థ్రిల్సి నిమా లు వచ్చి విజయాన్ని సాధిస్తున్నాయి.ఈ సినిమా కూడా అదే కోవ లోకి చెందాలని ఆశిస్తున్నాం.
ఇక ధన్య బాలకృష్ణ సహాయ నటి గా అందరికీ సుపరిచితురాలు,ఆమె తో పాటు గ ఈ సినిమా కి పని చేసిన వారందరూ కూడా తమ అత్యుత్తమ ప్రదర్శన ను ఇచ్చారు.కాబట్టి ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర
మంచి విజయాన్ని సాధించి కలెక్షన్ ల వర్షం కురిపిస్తుంది అని చెప్పవచ్చు.